న్యూస్ 6 రెండు ఫోటోలు పెట్టండి సార్

Published: Tuesday September 27, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి


*మా భూమి మాకే ఇవ్వాలని ఖానాపూర్ రైతుల ధర్నా
- అక్రమంగా రైతులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు
- రైతులకు అఖిల పక్ష పార్టీల మద్దతు *
-
రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని  ఖానాపూర్ గ్రామంలో 43/1 సర్వే నెంబర్ గల భూమి పట్టాలను 1992లో అప్పటి ప్రభుత్వం దాదాపు 60 మంది దళిత రైతులకు ఇచ్చారు, వారి పేర్లు పట్టా సర్టిఫికేట్లలో మరియు ధరణి వెబ్సైట్ లో నమోదై ఉన్నాయి, 30 సంవత్సరాలుగా రైతులు అక్కడ వ్యవసాయం చేస్తూ పూట గడుపుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు అధికారులు కుమ్మకై బలవంతంగా ఆ భూములు లాక్కోవాలని చూస్తుండటంతో, దానిపై ఆ భూములకు చెందిన దాదాపు 60 మంది రైతుల కుటుంబాలు వారి భూములు వారికే ఇవ్వాలంటూ గత మూడు రోజులుగా దీక్ష చేపట్టారు, ఆ దీక్షకు మద్దతుగా అఖిల పక్ష పార్టీలకు దీక్షలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలియజేశారు, రైతులకు న్యాయం జరిగే వరకు వాళ్ళు ఎన్ని రోజులు దీక్ష చేస్తే అన్ని రోజులు వారితో పాటు దీక్షలో పాల్గొంటాం అని రైతులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.అక్రమంగా రైతులను అరెస్ట్ చేశారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు భూములు ఇవ్వడం దేవుడెరుగు కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను దౌర్జన్యంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు, దాదాపు 60 మంది రైతుల కుటుంబాలు గత 3 రోజులుగా ఇక్కడ దీక్షలో ఉంటు ఇక్కడే వంట చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు, గత 30 సంవత్సరాల నుండి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు వారి భూములను దౌర్జన్యంగా లాక్కోవలనుకోవడం సిగ్గుచేటు అన్నారు, దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి, ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా అఖిల పక్షం తరపున పోరాటం చేస్తాం అని అన్నారు అన్నారు  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి సీపీఎం జిల్లా కార్యదర్శి కడిగాళ్ల భాస్కర్ మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య బీజేపీ నాయకులు కొప్పు బాషా కొత్త అశోక్ గౌడ్ బీస్పీ నాయకులు మహేష్ మహరాజ్ బీజేపీ నాయకులు పోరెడ్డి అర్జున్ రెడ్డి నాయిని సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు శేఖర్ మామా స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి , అడల బిక్షపతి, మధు, రాంబాబు, రాజు మరియు రైతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతుల మద్దతు దారులు పాల్గొన్నారు.