వ్యవసాయ మార్కెట్ బలోపేతానికి కృషి చేయాలి

Published: Saturday December 11, 2021
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 10 డిసెంబర్ ప్రజాపాలన : వ్యవసాయ మార్కెట్ బలోపేతానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉప్పరి మహేందర్, వైస్ చైర్మన్ గా E.దశరథ్ గౌడ్, డైరెక్టర్లచే ప్రమాణస్వీకారం చేయించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ లో ఉత్పత్తులను అమ్మకం వలన రైతులు అధిక లాభాలు గడించవచ్చన్నారు. తూకం సమయంలో అవకతవకలు జరగకుండా మార్కెట్ కమిటీ యంత్రాగం పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులు ఉత్పత్తులు అమ్ముకోవడానికి వచ్చిన సమయంలో సరళీకృతంగా అమ్మకాలు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తమ పరిధిలో గల రైతులకు ఉత్పత్తులను మార్కెట్ కమిటీ యార్డులొనే అమ్మే విధంగా అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.