రాహుల్ జూడో పాదయాత్రకు ఒక సైన్యంపాదయాత్రకు కార్యకర్తలు తరలింపులో మల్లు నందిని కృషి అమోఘంనం

Published: Wednesday November 02, 2022

01(ప్రజాపాలన ప్రతినిధి) మధిర నియోజకవర్గం లోని కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ మరోవైపు జిల్లా కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసుకుంటూ, హైదరాబాదులో సోమవారం రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో పాదయాత్రకు ఖమ్మం జిల్లా నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళటంలో  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి జిల్లా కాంగ్రెస్ నాయకురాలు అమ్మ ఫౌండేషన్ చైర్మన్, సామాజిక సేవకులు మల్లు నందిని పాత్ర అమోఘం అంటూ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కొనియాడారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మల్లు నందిని 20 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటున్నారు. మధిర ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం బిజీగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు నందిని అండగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ దిశ నిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై కార్యకర్తలతో కలిసి ఆమె ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ సమయంలో మధిర ఎమ్మెల్యేగా పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క గెలుపు బాధ్యతను మల్లు నందిని సవాలుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. హైదరాబాదులో జరిగే రాహుల్ జోడో పాదయాత్రకు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నుండి భారీ జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. భట్టి విక్రమార్క రాహుల్ పాదయాత్రలో బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మల్లు నందని జన సమీకరణ బాధ్యతలను తీసుకున్నారు. రేయంబగళ్ళు మల్లు నందని జిల్లా అంతా పర్యటించి రాహుల్ జూడో పాదయాత్ర విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చింది. అంతేకాకుండా పాదయాత్రకు వెళ్లే వారందరికీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించారు. మల్లు నందిని కృషితో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాదు తరలి వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీతో కలసి కొద్దీ దూరం పాదయాత్ర చేసే అవకాశం మల్లు నందినికి లభించింది. దీంతో మల్లు నందిని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, జోడో పాదయాత్ర విజయవంతం కోసం చేసిన ప్రచార కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర గురించి రాహుల్ గాంధీకి మల్లు నందిని వివరించారు. మల్లు నందిని జూడో పాదయాత్ర విజయవంతం కోసం చేసిన కృషిని  రాహుల్ గాంధీ అభినందిస్తూ కీప్  టప్ అంటూ మల్లు నందినిపై ప్రశంసల జల్లు కురిపించారు. మల్లు నందిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ నాయకులు పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలు కోరుతున్నారు.