*మోడల్ స్కూల్ వరకు ప్రత్యేక బస్సు నడపాలి: అంబేద్కర్ ప్రజా సంఘం*

Published: Wednesday February 22, 2023

*ప్రజాపాలన షాబాద్ ::==రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాల వద్ద అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేష్,  జిల్లా అధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ షాబాద్ మండల కేంద్రంలోని  మోడల్ స్కూల్ వెళ్లే వివిధ గ్రామాల నుంచి వచ్చే  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు షాబాద్ బస్టాండ్ నుండి మోడల్ స్కూల్ కి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో కొంతమంది  విద్యార్థులు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళుతున్నారు. కావున సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఈ సమస్య పరిష్కరించాలని అంబేద్కర్ ప్రజా సంఘం తరపున డిమాండ్ చేశారు. వెంటనే షాబాద్ బస్టాండ్ నుండి మోడల్  స్కూల్ వరకు విద్యార్థుల కోసం పాఠశాల సమయానికి అనుగుణంగా  పొద్దున సాయంత్రం  ప్రత్యేక బస్సు సర్వీసు నడపాలని  కోరారు.  అదేవిధంగా విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3500 కోట్ల  ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా  అన్ని ప్రభుత్వ పాఠశాలలో  పూర్తిస్థాయిలో  మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో  ఈ సమస్య పట్ల  ప్రజలను చైతన్యపరిచి  ఉద్యమాన్ని ఉదృతం చేసామన్నారు. ఈ కార్యక్రమంలో  అంబేద్కర్ ప్రజా సంఘం  రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జెడి రమేష్,  జిల్లా ప్రధాన కార్యదర్శి రంగపురం వెంకటేష్, మండల కార్యదర్శి  కళ్లెం ఆనంద్, జాయింట్ సెక్రటరీలు  నీరటి యాదయ్య, చర్లగూడెం నరసింహులు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు   నీరటి  అంజయ్య, ప్రముఖ కళాకారులు శివకుమార్,రమేష్,  సత్తయ్య, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.