రాష్ట్ర ప్రజలు సిఎం కెసిఆర్ సారథ్యంలో శాంతియుతంగా జీవించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్

Published: Thursday February 18, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి 17 ( ప్రజాపాలన ) : రాష్ట్ర ప్రజలందరూ సిఎం కెసిఆర్ సారథ్యంలో శాంతియుతంగా జీవించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం సిఎం కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో "మెతుకు ఆనంద్ అన్న సైన్యం" ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ కోటివృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లాగా  చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 67 సంవత్సరాలు ముగించుకొని 68 వ యేట అడుగుపెడుతున్న శుభ తరుణంలో ఆయనకు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజెశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కేసీఆర్ సారధ్యంలో శాంతియుతంగా జీవించాలని కోరుకుంటూ శాంతికి చిహ్నమైన పావురాలను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, పిఏసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్,  మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ హఫీజ్, మాజీ జడ్పిటిసి ముత్తహార్ షరీఫ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.