బిజెపి మతతత్వ పాలన నుంచి విముక్తి కోసం భారత్ జోడో యాత్ర. -జోడు యాత్రలో అందరూ భాగస్వామ్యం అవ్

Published: Saturday October 29, 2022
చేవెళ్ల, అక్టోబర్ 28 (ప్రజా పాలన):

ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ  భారతదేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసం చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కొనసాగుతుందని చేవెళ్ల  నియోజకవర్గం నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారత్ జూడో యాత్రలో శుక్రవారం నాడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ దేశం మతతత్వ పార్టీల చేతుల్లో బానిస కావద్దని ఉద్దేశంతో  ప్రజాలందరినీ సంఘటితం చేయాలని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జూడో యాత్ర ప్రారంభించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని ఇటు దేశంలో, రాష్ట్రంలో అవినీతి దోపిడి పాలనే కొనసాగుతుందని అన్నారు రానున్న రోజుల్లో దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతుందని ప్రతి ఒక్కరూ భారత్ జూడో యాత్రలో  భాగ్యసామ్యం కోసం సిద్ధం కావాలని చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచి నర్సింలు నాయకులు శేఖర్ రెడ్డి, సాయికుమార్ , భారత్ జొడో పాదయాత్ర లో పాల్గొన్నారు