ఈడి కార్యాలయ ముట్టడికి భారీగా తరలిరావాలి టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి

Published: Wednesday July 20, 2022

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అక్రమంగా ఈడీ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న చేపట్టే ఈడి ఆఫీస్ ముట్టడికి ఇబ్రహీంపట్నం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి పిలుపునిచ్చారు. జూలై 21న ఈడి ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపుమేరకు, మంగళవారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజేపి ప్రభుత్వం తమ చేతకాని తనంతో అక్రమంగా ఈడి ద్వారా నోటీసులు ఇవ్వడం వల్ల, జూలై 21వ తారీఖు రోజున సోనియాగాంధీ ఈడి ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించడం సబబు కాదని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, ఎలా అయిన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని, గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని బిజేపి ప్రభుత్వం అక్రమంగా ఈడీ నోటీసులు పంపడం జరిగిందని ఆరోపించారు. దానికి నిరసనగా ఈనెల 21న ఈడి ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి తన తరపున వెయ్యి మందిని తీసుకొచ్చి ఈడీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.