రహదారి నిర్మాణ పనుల శంకుస్థాపన : ఎమ్మెల్యే సంజయ్

Published: Wednesday August 11, 2021
జగిత్యాల, ఆగస్టు 10 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లాలోని చలిగల్ గ్రామం మ్యాంగో మార్కెట్, వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులు 22 లక్షలతో రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత శంకుస్థాపన చేసినారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రైతును రాజు ను చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రిదని, రైతులు ఉద్యానవన పంటలకు మొగ్గు చూపాలని, రైతు బాగుంటే వ్యాపారులు, రాష్ట్రం అంతా బాగుంటుందని ప్రభుత్వం రైతులకోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతం  కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జలకళ సంతరించుకున్నాయని, వ్యవసాయం సాగు పెరిగిందని, జిల్లా రైతులు డ్రాగన్ ఫ్రూట్  సాగు కూడా పెరిగిందని, తెలంగాణ వచ్చాక 10 కోట్ల పైన మార్కెట్ల కోసం నిధులు వెచ్చించామని పండ్ల మార్కెట్ కు 5 కోట్లు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, షెడ్లు, 40 లక్షలు పెట్టి పండ్ల మాగబెట్టే కేంద్రం ఉందని, ఒకే రకమైన వరి మాత్రమే కాకుండా కొత్త పంటలపై దృష్టి సారించాలని రైతు వేదికలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎల్లా గంగానర్సు రాజన్న, అర్బన్ జడ్పీటీసీ మహేష్, జిల్లా రైతు బంధు సమితి మెంబెర్ బాల ముకుందాం, అర్బన్ మండల రైతు బంధు సమితి మెంబెర్ జుంబర్తి శంకర్, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, ఎఎంసి డైరెక్టర్లు బండారి విజయ్, చిర్ర నరేష్, లక్ష్మి, పుల్ల మల్లయ్య, మోహన్ రెడ్డి, పాపనుక రవి, బట్టు ప్రవీణ్, మార్కెటింగ్ అధికారి ప్రకాష్, సెక్రటరీ చంద్రశేఖర్, హస్నాబాద్ ఎంపీటీసీ మల్లారెడ్డి, మ్యాంగో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోసిన్, మండల, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అంజనేయులు, ఆనంద్ రావు, కౌన్సిలర్ పంబాల రాం కుమార్, అంబారిపెట్ సర్పంచ్ గంగాధర్, నాయకులు సత్యం, అసిఫ్, పులిశెట్టి శ్రీనివాస్, వెంకటేష్, గంగారాం, డాన్ శ్రీనివాస్, ఫయాజ్, గంగారెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు