భర్తల పెత్తనాన్ని కట్టడి చేయాలి

Published: Wednesday March 17, 2021

ఎంఎస్సి జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్య
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి

ఆసిఫాబాద్ జిల్లా మార్చి16 (ప్రజాపాలన ప్రతినిధి) : కుమురంబీం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని మహిళ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి అధికారాన్ని జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు, నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారి పెత్తనాన్ని కట్టడి చేయాలని ఎం ఎస్ పి జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ కింద మహిళా ప్రజాప్రతినిధులు గా ఎన్నికైన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి లుగా ఎన్నికైనరని,  కానీ వారి అధికారం మొత్తం కూడా వారి భర్తలు, కుటుంబ సభ్యులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. స్వతహాగా వారే ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులను చేపట్టడంతో పనులలో నాణ్యత లోపించడమే కాకుండా అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. భవిష్యత్తులో అధికారం ఉంటుందో,  ఊడుతుందో, అనే ఆలోచనలో ధనార్జన తో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మహిళా ప్రజాప్రతినిధులు గా ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎంఎస్పి జిల్లా కో ఆర్డినేటర్ రేగుంట మహేష్, జిల్లా కో కన్వీనర్ లోబడే లహు కుమార్, సాయి కుమార్, తదితరులు ఉన్నారు.