బ్యాంక్ రుణాలు ఎవరు కట్టొద్దు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. రుణ మాఫీ చేస్తాము మల్

Published: Monday June 20, 2022

పేదలకు పింఛన్లు.. రేషన్ కార్డులు..డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్న టి అర్ స్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో గుణపాఠం తప్పదు.మల్ రెడ్డి రంగారెడ్డి
ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి  మాట్లాడుతూ . వచ్చే 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని..రైతులకు బడుగు బలహీన వర్గాల మహిళలకు యువకులకు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.నిరుద్యోగులకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా,మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వకుండా,రైతులకు రుణమాఫీ చేయకుండా,ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నా కేసీఆర్ గారికి గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు ని రాజు చేస్తామని,రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని,ప్రతి ఉపాధి కూలీ కి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని,భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేస్తామని,ప్రజలకు ఇబ్బందిగా ఉన్నా ధరణి వ్యవస్థని ఎత్తివేసి నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు..గుర్నాథ్ రెడ్డి..చిలుక మధుసూదన్ రెడ్డి..స్థానిక ఎంపిటిసి పిట్టల అనసూయ సీతయ్య..వెదిరే యోగేశ్వర్ రెడ్డి జడల రవీందర్ రెడ్డి..కొండ్రు ప్రవీణ్..మంకాల కరుణాకర్ తో పాటు స్థానిక నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి,యాదిరెడ్డి,తాళ్ల కృష్ణ,గుడ్డేటి రవి,ధనలక్ష్మి,నాగరాజు,జగదీష్,కాశీపతి,రాజు,సాయి,బాలకృష్ణ,నాగేశ్ శ్రీకాంత్,అరుణ్ యాదవ్,భరత్,శ్రీకాంత్ తో పాటు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.