తలసేమియా, సికిల్ సెల్, వ్యాధిగ్రస్తుల ఉచిత మెడికల్ క్యాంప్

Published: Monday July 11, 2022
మంచిర్యాల టౌన్, జూలై 10, ప్రజాపాలన :  మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్, వ్యాధిగ్రస్తులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంప్ కు అమెరికాన్ ఓంకాళోజి హాస్పిటల్ నుండి డాక్టర్ రంజిత్ కుమార్ సి.ఎస్ హీమోటోలోజిస్ట్ ద్వారా 73 మంది వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ కుమార్ సి.ఎస్  మాట్లాడుతూ తలసేమియా  వ్యాధిగ్రస్తులకు 9 గ్రాముల హిమోగ్లోబిన్ ను మెంటన్ చేయాలి, ఐరన్ చిలేషన్ మందులు వాడాలని, వ్యాధి నయం కావడానికి బోన్ మారో మార్పిడి ఒకటే మార్గం అన్ని అన్నారు.వ్యాధికి సంబంధించిన వాక్సినేషన్ తీసుకోవాలని  సూచించారు.
మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ  బ్లడ్ బ్యాంకు లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి 1000 మంది వరకు వ్యాధిగ్రస్తులు ఉన్నారు వారికి వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా వైద్యం పొందుతున్నారు,
వీరంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి వీరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీరికి  మెరుగైన వైద్యం అందించుట  కొరకు డాక్టర్ రంజిత్ కుమార్ సి.ఎస్ ను హైదరాబాద్ నుండి  పిలిపించి వారి ద్వారా వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు కిషోర్ ,పాతలజిస్ట్ వంశీ, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి పడల రవీందర్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు,తలసేమియా ట్రాన్సఫిషన్ ఇంచార్జి కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, రక్తనిధి నర్సులు సంధ్య,మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.