కామాంధుడిని కఠినంగా శిక్షించాలి

Published: Monday September 13, 2021
-డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు మిడివెల్లి రాజ్ కూమార్
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 12, ప్రజాపాలన హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక పై అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్యచేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు మిడివెల్లి రాజ్ కూమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చిన్నారిపై జరిగిన దుర్మార్గపు చర్యను కండిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్. కృష్ణ కాలనీ ఏరియాలో మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఉన్నటువంటి ఆరేళ్ల బాలిక పైన రాజు అనే కామాంధుడు అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్యచేశాడని అన్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని వేగంగా అమలు చేయక పోవడం, న్యాయం అందించడంలో జరిగే జాప్యం, నిర్లక్ష్యం కారణంగా ఈలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. నేర దర్యాప్తులో రాజకీయ జోక్యం, కుల, వర్గవివక్షలు సామాన్యు లకు న్యాయం అందని ద్రాక్ష గా మారు తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా కూడా ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో స్పందించక పోవడం దురదృష్టం అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని హత్యలు చూడాలి, ఈ రాష్ట్రంలో ప్రియాంక హత్య కి వచ్చిన స్పందన పసిపాప పై జరిగిన హత్యకు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అన్నారు. బాదిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, వెంటనే ఇరవై లక్షల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము.