బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

Published: Thursday November 24, 2022
* బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గొర్ల కాడి క్రాంతి కుమార్
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజా పాలన : బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గొర్ల కాడి క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని శుభాభివందనాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గొర్లకాడి క్రాంతి కుమార్ మాట్లాడుతూ బహుజనుల ఆశా జ్యోతి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్య పరంగా ఎదిగేందుకు కృషి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం బహుజనులకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు అగ్రవర్ణాల పాలకుల చేతిలో అణగారిన ప్రజలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చైతన్యముతో రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. బహుజనుల అభివృద్ధి కొరకు నీలిరంగు జెండా పాలన ఉత్తమ మార్గం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జి.క్రాంతి కుమార్, అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్య, నియోజకవర్గ అధ్యక్షులు తలారి రాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇంటివెనుక అరుణ్, వివిధ మండలాల నాయకులు, వికారాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఇ.గణేష్, కార్యకర్తలు, ఎస్ఎస్ యు ( స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ) యూనియన్ సభ్యులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.