కంటి వెలుగులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Published: Thursday December 01, 2022
జిల్లా వైద్య అధికారి పాల్వాన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : 
                                                             రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంలో పని చేయుటకు అవుట్సోర్సింగ్ పద్ధతిన పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్,05 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య అధికారి పాల్వాన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ కు గాను 2 సంవత్సరాములా డిఓఏ/డిఓఎం కోర్సు పూర్తి చేసి, తెలంగాణ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి ఉండాలని అన్నారు. పారితోషికం నెలకు రూ.30,000 లు అందించడం జరుగుతుందని తెలియజేసినారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్ లతో డిసెంబర్, 05 న ఉదయం10 :00 గంటలకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలిని కోరారు.