రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర పై సన్నాహక సమావేశం

Published: Wednesday October 26, 2022

బోనకల్,అక్టోబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర పై జిల్లా కాంగ్రెస్స్ అద్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పువా ళ్ళ మాట్లాడుతూ దేశ సమైక్యత,సమగ్రత కోసం రాజకీయ,వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉన్న పరిపాలకులు విచ్చన్నకరం చేస్తూ మతసామరస్యాన్ని రెచ్చగొడుతూ,మతాల ద్వారా లబ్ధిపొందుతూ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ అధానిలకి,అంబానిలకు తాకట్టు పెడుతూన్నారని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతున్నయాని,కనీసం ఆడపిల్లలకి రక్షణ కల్పించటంలో బీజేపీ,తెరాస పూర్తీగా విఫలమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మర్డర్లు, మానభంగాలు డ్రగ్స్ వీటికి ప్రోత్సాహంగా దేశంలో ,రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో దేశ సమైక్యత కోస రాహుల్ గాంధీ ఆయన తండ్రి,నాయనమ్మ ప్రాణం త్యాగం చేశారనీ గుర్తు చేశారు.దేశ ప్రజల కోసం రాహూల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేయడానికి అయినా సిద్ధమే అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారనీ దుర్గాప్రసాద్ అన్నారు.ప్రజాసౌకర్యం కోసమే ఈ పాదయాత్ర అని చెప్పి భారత్ జోడో యాత్రను ప్రారంభించి దాదాపు 3500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ దేశంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగుతున్న సందర్భంగా నెల 23వ తేది నాడు తెలంగాణ రాష్ట్రంలో ఘన స్వాగతం పలికినట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్ నుంచి 30వ తారీఖు నాడు రాహూల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా రాహూల్ అడుగులో అడుగు వేసి నడవటం కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ జరగుతుందని మధిర నియోజకవర్గంలో నుంచి కూడా అత్యధిక జనసమీకరణ చేయాలని కోరారు. అందులో భాగంగానే పార్టీ అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ ,ఖచ్చితంగా మధిర నియోజకవర్గంలో నుంచి అత్యధికంగా 100నుంచి 150 బుసులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాహూల్ జోడో యాత్రను జయప్రదం చేయాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్లు పైడిపల్లి కిషోర్ కుమార్,పుచ్చకాయల వీరభద్రం,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కలకోట సొసైటీ ఛైర్మెన్ కర్నాటి రామ కోటేశ్వరరావు,డీసీసీ కార్యదర్శి బందం నాగేశ్వరరావు,చిరునోముల సర్పంచ్ మలకారపు రవి,మండల ఎస్సి సెల్ నాయకులు మారుపల్లి ప్రేమ్ కుమార్,కిసాన్ సెల్ అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రు నాయక్,సీనియర్ నాయకులు చేబ్రోలు వెంకటేశ్వర్లు,తిరుపతిరావు యువజన నాయకులు హీమోను,మరీదు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.