ఉపాధిహామీ పనులు పరిశీలించిన సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్

Published: Wednesday May 25, 2022

బోనకల్, మే 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ఉపాధి హామీ పనులును మంగళవారం గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను స్వయంగా పరిశీలించి వారికి వస్తున్న వేతనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.కూలీలు ఏండ త్రీవత ఎక్కువగా ఉన్నందున పనిచేస్తున్న ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఓఆర్ఎస్, మంచినీళ్లు, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచుకొని పనులు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ , ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు ,పంచాయతీ కార్యదర్శి జొన్నలగడ్డ అశోక్ ఉపాధి మేట్లు,కులీలు పాల్గొన్నారు.