ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి* సర్కిల్ ఇన్స్

Published: Friday March 10, 2023

మెట్రో న్యూస్,ఇబ్రహీంపట్నం:యువత ముఖ్యంగా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ షీ టీమ్స్ ఎస్సై శ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ పరిధిలోని మంగళ్పళ్లిలో గల భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు,ర్యాగింగ్,ఆడ  పిల్లలపై జరుగుతున్న అనేక ఆకృత్యాలపై  ఇబ్రహీంపట్నం షీ టీమ్స్  ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.నేటి సమాజంలో యువత తప్పుదోవ పట్టడానికి, అసాంఘిక శక్తుల కార్యకలాపాలు సాగడానికి,మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న అనేక ఆకృత్యాలకు ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలే ప్రథమమని,  అవసరమైతేనే ఇంటర్నెట్,  యూట్యూబ్ స్మార్ట్ ఫోన్లను వాడాలని, సాధ్యమైనంతవరకు పుస్తకాలతో కుటుంబంతో,స్నేహితులతో కాలక్షేపం చేయాలని సూచించారు.విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని,  ర్యాగింగ్ కు పాల్పడే వారిపై చట్టం కఠినమైన చర్యలు తీసుకుంటుందని సీఐ రామకృష్ణ అన్నారు.ముఖ్యంగా విద్యార్థులు,ఆడపిల్లలు తమ వాట్సాప్ డీపీలలో ఫోటోలు పెట్టొద్దని,వాటిని మార్ఫింగ్ చేస్తూ నేరస్తులు అనేక అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారని,కొత్త వాళ్లతో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని,  ఎటువంటి ఇబ్బంది కలిగిన తమ కుటుంబీకుల గాని పోలీసులకు గాని వెంటనే తెలియజేయాలని షీ టీం ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు.