కొటాలగూడలో బీరప్ప జాతర మహోత్సవం

Published: Tuesday March 15, 2022
వికారాబాద్ బ్యూరో 14 మార్చి ప్రజాపాలన : గొల్ల కురుమల ఆరాధ్యదైవం బీరప్ప జాతరను కొటాలగూడ గ్రామంలో ఘనంగా నిర్వహించామని గ్రామ సర్పంచ్ రాములు నాయక్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవానికి గ్రామస్తులు గొర్రెలు మేకలను అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు బీరప్ప జాతర ఉత్సవాలను చూసి తరించడానికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారని వివరించారు. ఐదేళ్లకొకసారి జరిగే బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని స్పష్టం చేశారు. గొర్రెలు మేకలు పశుసంపద అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలను చల్లగా చూస్తాడని ఆ దేవుని కరుణాకటాక్షాలు ఉంటాయని ప్రజల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంత్ రెడ్డి వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.