దళారీ వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యం : చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి

Published: Thursday September 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజాపాలన : దళారీ వ్యవస్థను రూపుమపడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో గల మర్పల్లి మండలంలో నూతన మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ అంతమై రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు అమ్మకాలుళ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి వికారాబాద్ డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ మర్పల్లి ఏఎంసీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం మర్పల్లి ఎంపిపి బట్టు లలిత రమేష్ మర్పల్లి జడ్పిటిసి మధుకర్ పిఎసిఎస్ చైర్మన్ సనగారి ప్రవీణ్ రెడ్డి మర్పల్లి ఎంపీటీసీ సంగీత వసంత కుమార్ ఈడిగి నాయబ్ గౌడ్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు