విద్యార్థులకు ఆహారం అందించుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధి

Published: Wednesday September 28, 2022
సెప్టెంబర్ 27, 2022 :
 
పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, వెనుకబడిన తరగతుల వసతిగృహాలలో విద్యార్థులకు ఆహారం అందించుటలో ఉద్యోగులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి తెలిపారు. మంగళవారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ సంక్షేమశాఖలు, టి.ఎం.ఆర్.ఈ. ఐ. ఎన్., టి.ఎన్. డబ్ల్యు ఆర్.ఈ. ఐ., టి.టి.డబ్ల్యు. ఆర్.ఈ.ఐ., కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు, ఎం.కె.పి.టి.ఎన్., యు.ఆర్.ఎన్., టి.ఎన్.ఎం.ఎన్., వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల కుకింగ్ స్టాఫ్కు జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ లో గల టి.ఎం.ఆర్. పాఠశాల, జూనియర్ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ కేసులను నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ నెల 28న డిప్యూటీ వార్డెన్లు, 29న స్టాఫ్ నర్సులు, 30న ప్రిన్సిపాళ్ళకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి. ఎం.ఆర్.ఎన్.జె.సి. ప్రిన్సిపల్ దమయంతి, చెన్నూర్ ప్రిన్సిపల్ ఎం. తిరుపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాన్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.