నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోకి తేజస వినతిపత్రం

Published: Thursday August 25, 2022

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24 ( ప్రజాపాలన ప్రతినిధి):
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయంలోని డివిజనల్ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందించారు. అనంతరం పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న టిఆర్టీ, జూనియర్ మరియు డిగ్రీ లెక్చరర్ పోస్టులతో పాటు గ్రూప్ 2,3,4 నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనే రైల్వే కేసుల్లో ఇరుక్కున్న నిరుద్యోగులపై బేషరతుగా కేసులు ఎత్తివేయలన్నారు. విఆర్వో ఉద్యోగుల్ని యథాతథంగా కొనసాగిస్తూ, విఆర్యేల న్యాయమైన కోరికాల్ని పరిష్కరించాలని, అన్నిటికన్నా ముఖ్యంగా 2018 ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగుల అందరికి నెలకి 6 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్, విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాపెల్లి దిలీప్, యువజన సమితి నియోజకవర్గ అధ్యక్షుడు వన్నెల శశి, నాయకులు బొడ్డు సుధాకర్, తోగిటి లక్ష్మినారాయణ, చేపూరి సతీష్, బత్తుల నాగరాజు, జోగిపాటి చౌదరి తదితరులు పాల్గొన్నారు.