ఆసరా పెన్షన్లు అందించి ఆదుకోవాలి. కొలిపాక శ్రీనివాస్ విజ్ఞప్తి

Published: Saturday August 06, 2022
బెల్లంపల్లి, ఆగస్టు 5 , ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి, కెసిఆర్ అందిస్తున్న ఆసరా పెన్షన్లు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆసరా పెన్షన్లను మంజూరు చేసి ఆదుకోవాలని ,బెల్లంపల్లి పట్టణ మర్చంట్స్ అసోసియేషన్  ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లోని వృద్ధులు, వికలాంగులు,  ఒంటరిమహిళల, కు  ఇస్తున్న ఆసరా ఫెన్షన్ లు, నెల దాటి 2వ నెల గడుస్తున్న  ఆసరా ఫెన్షన్ రాకపోవడం వల్ల  ముఖ్యంగా వృద్ధులు, పెన్షన్ ఫై ఆదారపడి జీవితాలు గడుపుతున్న వికలాంగుల పరిస్థితి, అగమ్య గోచరంగా ఉందని అన్నారు, వారి ఆకలి కేకలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసరా పెన్షన్లను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
  శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, వివిధ రాజకీయ నాయకులకు, వస్తున్న జీతభత్యాలు వారు అనుకున్న ప్రకారమే వారి వారి ఖాతాల్లో, నిర్ణీత సమయాల్లో జమ అవుతున్నట్లుగానే, ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు సరైన సమయంలో అందించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే ,ఎంపీలకు, ఒక నెల జీతాలు ఆలస్యమైన బ్రతకగలుగుతారు కానీ, ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ల కోసమే ఎదురుచూస్తూ బ్రతుకుతున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బ్రతకడం చాలా కష్టమని అందుకే ముఖ్యమంత్రి  ప్రతినెలలో ఒక సమయం నిర్ణయించి, నిర్ణయించిన సమయంలో నే, ఆసరా పెన్షన్లు అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే 2018లో ఆన్లైన్ ద్వారా ఆసరా పెన్షన్ల  కోసం నమోదు చేసుకున్న అర్హులైన వారందరికీ వెంటనే ఆసరా పెన్షన్లను మంజూరి చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.