ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో పోలీస్ డిపార్ట్మెంట్ అశ్వాపురం సిఐ చెన్నూరు శ్రీనివాస్.

Published: Tuesday September 27, 2022
 బోనకల్, సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలోనే రైల్వే సబ్ స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం రైల్వే ట్రాక్ పై పడి ఉంది. రైలు ప్రమాదంలో మృతి చెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేసి మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే ట్రాక్ పక్కన గల వైన్ షాప్ వద్ద సాయంత్రం వరకు మృతి చెందిన వ్యక్తి కనిపించాడని తెలిపారు. మృతదేహం వద్ద ఓ మందు సీసా, గారెలు, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. మద్యం సీసాలో పూర్తిగా మందు తాగినట్లు ఉండగా రైల్వే ట్రాక్ కు లోపల భాగం తల తగిలి, తలకు బాగా గాయమై తీవ్రంగా రక్తస్రావం జరిగి ఉంది. ఆత్మహత్య చేసుకున్నా, రైలు ఢీకొన్న శరీర భాగాలు దూరం పడవలసి ఉంది. కానీ సంఘటన వద్ద అటువంటి ఆనవాలు ఏమీ లేవు. అదేవిధంగా మృతదేహం ట్రాక్ వెలుపల భాగం పడవలసి ఉంది, కానీ ట్రాక్ మధ్యభాగంలో తల ట్రాక్ కు ఆనుకొని పడి ఉంది. సంఘటన బట్టి చూస్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసేందుకు మృతదేహాన్ని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువచ్చి పడేసి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 
 
  రైల్వే ఎస్సై రవి రాజ్ వివరణ: 
రైలు వెనుక భాగం తగిలి ఉండవచ్చునని దీనివలన తలకు వెనుక భాగం గాయమైందని తెలిపారు. అందువల్లే మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. రైలు ప్రమాదంలోనే మృతి చెందాడని తెలిపారు. మృతదేహం వివరాలు తెలియవలసి ఉందన్నారు. ప్రస్తుతం మార్చురీలో ఉంచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.