న్యూస్ 2రెండు ఫొటోస్ పెట్టండి సార్

Published: Tuesday August 02, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి.

*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  తెలంగాణ రైతు సంఘం ట్రేడ్ యూనియన్ సిఐటియు  ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం  ముందు ధర్నా*
              
ముందుగా  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు  వ్యవసాయ కార్మిక సంఘం  ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు  కాచం కృష్ణమూర్తి వర్ధంతి ఘనంగా జరిగాయి.
 
ఈరోజు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు  అమలు చేయాలని  పేదలు సాగు చేసు కుంటున్న  ప్రభుత్వ  భూములకు పట్టాలు ఇవ్వాలని పేదల పై మోపిన భారాలను  తగ్గించాలని  తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా  కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు   పి అంజయ్య    అధ్యక్షతన  జరిగింది  ముఖ్యఅతిథి  రైతు సంఘం జిల్లా కార్యదర్శి  బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ   పేదలు తరతరాల నుండి కుర్మిద్ద సింగారం తాటిపర్తి నంది వనపర్తి  గ్రామ రైతులు  సాగు చేసుకుంటున్న  రక్షిత కౌలుదారు లకు  పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని  37ఏ సర్టిఫికెట్ ఇచ్చి  38ఈ రాకుండా  భూస్వాములు కుట్ర పూరితంగా  దేవుని పెరు నమోదు  చేసినారు  మూడు తరాల నుండి ఈ భూములను  దున్నుకొని బతుకుతున్నారు  కాబట్టి  వీరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి. ప్రభుత్వ  గైరాన్ సీలింగ్  భూదాన  భూములకు  గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు  ఉన్నప్పటికీ  ధరణి వచ్చిన తర్వాత  వీరికి ఇప్పటికి పాస్బుక్కులు రాకపోవడం లేదు  రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు  వెంటనే వారికి నూతన పాస్బుక్కులు ఇవ్వాలి . తమ్మలోని గూడెం లో 90 ఎకరాల భూమి 16 వత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు  ఎమ్మెల్యే మంత్రి కలెక్టర్  వచ్చి ఈ భూములో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం  శంకుస్థాపన చేసిన సందర్భంగా  పట్టాలు ఇస్తామని  మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇప్పటివరకు వరకు పట్టాలు ఇవ్వలేదు వెంటనే వారికి పట్టాలు ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి  ఇల్లు నిర్మించడానికి 5 లక్షలు ఇవ్వాలి.  ఇల్లు లేని పేదలందరికీ  డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి . ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన  చట్టాన్ని అమలు చేయాలి  పేదలందరికీ విద్య వైద్యం  పూర్తిస్థాయిలో  ప్రభుత్వ రంగం అందించాలి. రేషన్ కార్డు లేని వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. రేషన్ షాపుల్లో  14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని.57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య  పెన్షన్ ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి . బ్యాంకులో రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ  కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి
ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎల్లంపల్లి నరసింహ గౌరవ సర్పంచులు దూస రమేష్   యం భాషయ్య  డి పెద్దయ్య సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు  పి బ్రహ్మయ్య  రైతు  సంఘం మండల కార్యదర్శి ఎం పి నరసింహ  వ్యవసాయ కార్మిక సంఘం  మండల అధ్యక్షు సిహెచ్ సత్యం  మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ   ఉప సర్పంచులు కె పాండు చారి  కావాలి జగన్  రమేష్  గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు  పి వెంకటయ్య  మహిళా సంఘం  మండల కార్యదర్శి ఎం అరుణ  వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు  ఎం రుపేందర్ ఎం రాములు పి శివ  ఏ జంగయ్య యాదయ్య   శ్రీరాములు .చందు  డి బుగ్గారాములు జంగారెడ్డి ఎం కృష్ణ  కె జంగయ్య గోపాలు  తదితరులు పాల్గొన్నారు.