రాచకొండ కమిషనర్ సీపీ మహేష్ భగవత్ జన్మదిన వేడుకలు

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : రాచకొండ కమిషనర్ సి పి మహేష్ భగవత్ జన్మదిన వేడుకల సందర్భంగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పరిరక్షణ పర్యవేక్షణ అవసరమని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలియజేశారు. రాచకొండ పోలీస్ కమీషనర్ సి.పి మహేష్ భగవత్ పుట్టిన రోజు సందర్బంగా మీర్ పేట్ పోలీస్ వారు స్టేషన్ పరిధిలో కేక్ కట్ చేసి, ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం గురువారం నాడు నిర్వహించారు. కరోనా కు భౌతిక దూరంతో పాటు మాస్కులు అవసరమని ప్రజలకు మాస్కలను అందజేశారు. ఈ సందర్భంగా మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..... సి.పి మహేష్ భగవత్ సార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మాకు  ఇచ్చిన ధైర్యంతో పోలీస్ సిబ్బంది కరోనా లొక్డౌన్ సమయంలో కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పనిచేస్తున్నారని, యావత్ రాచకొండ పోలీస్ సిబ్బందికి, సి పి కి స్ఫూర్తిదయాకంగావున్నారని అన్నారు. పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ గా వున్నారని, అదేవిధంగా పోలీసింగ్ తో పాటు ప్రజా ఉపయోగాల కార్యక్రమాలను ఎన్నో  చేపట్టారని తెలిపారు. వారు (సి.పి) సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లోని  డి ఐ  సత్యనారాయణ, ఎస్ ఐ  లు మారయ్య, ఉదయ్ భాస్కర్, కృష్ణా రెడ్డి, వెంకట్ రెడ్డి, మిగతా పోలీస్  సిబ్బంది, తో పాటు ఉత్సాహంగా విధినిర్వహణలో పాల్గొన్నారు.