ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన నీతి అయోగ్ బృందం

Published: Thursday August 18, 2022
బోనకల్, ఆగస్టు 17 ప్రజా పాలన ప్రతినిధి: పి ఐ పి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ పరిశీలనకై నీతి అయోగ్ కేంద్ర పరిశీలన బృందం బుధవారం బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్రాహ్మణపల్లి పల్లెదవాఖాన ను సందర్శించినారు. కేంద్ర బృందం నుండి మధుబద్రి, డాక్టర్ ప్రభు స్వామి జిల్లా కేంద్రం నుండి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సైదులు, ఎన్ హెచ్ ఎం సమన్వయకర్త నీలోహన హాజరైనారు. ముందుగా బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించి అన్ని జాతీయ కార్యక్రమాలు పరిశీలన చేశారు. ముఖ్యంగా ఓపి సేవలు, ల్యాబ్ ఫార్మసీ, డెలివరీలు, గర్భిణీ స్త్రీల నమోదు సేవలు బాలింతల గృహ సందర్శన వారికి అందుతున్న సేవలు టిబి, లెప్రసి ,బీపీ ,మధుమోహo వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా అందుతున్న సేవలు పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలపై వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రాహ్మణపల్లి పల్లె దవాఖాన డాక్టర్ గ్రీష్మ నుండి గ్రామంలో పల్లె దవాఖాన ద్వారా అందుతున్న సేవలు తెలుసుకొని వివరాలు సేకరించారు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి ఏఎన్ఎం ఎం శ్రీలక్ష్మి, వెంకటరమణ, ఆశా కార్యకర్తల నుండి వివరాలు సేకరించి రికార్డులు పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పి శ్రీనివాసరావు, స్టాఫ్ నర్స్ భవాని, ఫార్మసిస్ట్ రాదాలత, ఎల్ టి యాకూబ్, నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, టి స్వర్ణమాత, పి రాజ్యలక్ష్మి, డీఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
 
 
Attachments area