డాక్టరేట్ పట్టా పొందిన నిరుపేద రైతుబిడ్డ

Published: Thursday December 02, 2021
బోనకల్‌, డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలీలైన వెంకటేశ్వర్లు, దుర్గ దంపతుల కుమారుడు గుడిద గోపి వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్ డీ పూర్తి చేసి డాక్టరేట్ సాధించాడు. ఇంటర్ పూర్తి అయ్యాక ఉపాద్యాయులు శ్రీనివాసరావు ప్రోత్బలంతో మరియు వ్యవసాయం పై మక్కువతో ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ జాయన్ అయ్యి 2016 లో పూర్తి చేసారు. తమిళనాడు విశ్వ విద్యాలయంలో ఎమ్ టెక్ (వ్యవసాయ శాస్త్రం) 2018 పూర్తి చేసారు. అనంతరం కేరళ విశ్వ విద్యాలయంలో కేరళ రాష్ట్రంలో తరచుగా వచ్చే వరదలపై పరిశోదనలు చేసినందుకు గాను జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో 7 పరిశోదనా పత్రాలు, 5 వ్యాసాలు ప్రచురించారు. పేదరికం వెంటాడుతున్న వెనుకడుగు వేయక డాక్టరేట్ పట్టా పొంది గుడిదే గోపి లక్ష్యం సాధించాడు. ప్రస్తుతం డాక్టరేట్ పట్టా పొంది ప్రొ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పట్టుదల ఉంటే కానిది ఏది లేదు అనడానికి మంచి ఉదాహరణగా నిలిచాడు. సోదరి అగ్రికల్చర్ డిప్లమాలో విద్యను అభ్యసించి ఉద్యోగ వేటలో ఉంది. ఇంతటి ప్రోద్బలం అందించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గోపి అభినందనలు తెలిపాడు.