సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ...

Published: Tuesday May 18, 2021
జగిత్యాల, మే 17, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 12 లక్షల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల మండల్ మొరపల్లి గ్రామానికి చెందిన అంగరి గంగరాజం ఇటీవల కరెంట్ షాక్ తో మరణించగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కు 4.50 లక్షల ఫిక్సడ్ బాండ్ ని గంగరాజం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్ లో డా.సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలేపు రాజేంద్రప్రసాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేష్ సర్పంచ్ గంగారాం ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు ఎంపీటీసీ మహేష్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ బాలపల్లి సర్పంచ్ భూపతి రెడ్డి ఏడిఈ జవహర్ నాయక్ ఏఈ సుందర్ తదితరులు పాల్గొన్నారు.