ప్రజా సమస్యల లక్ష్యయంగా పోరాటాలు నిర్వహించాలి

Published: Saturday November 05, 2022
 ప్రజా పాలన- శేరిలింగంపల్లి /నవంబర్ 4 న్యూస్ :MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3,4 తేదీలలో రెండు రోజుల పాటు మియాపూర్,ముజాఫర్ ఆహ్మద్ నగర్ లో సామాజిక,రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా రెండవ రోజు శిక్షణ తరగతుల కు హజరు అయినా MCPI(U) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ గారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి పార్టీ తన మతోన్మాద విధానాలను అవలంబిస్తూనే ప్రజలపై అనేక రకాలుగా ధరలబారాన్ని, జిఎస్టి రూపంలో ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేద,సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మౌలిక వసతులు కల్పించకుండా మరింత సమస్యల సుడిగుండంలో నెట్టడానికి పరిపాలన చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనేక రకాలుగా పీడించే విధానాలను సృష్టిస్తూ దోపిడి వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని వీటికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. జరుగుతున్న ధరలకు మురికివాడలోని స్థానిక సమస్యలపై ప్రభుత్వాలను నిల తీయడానికి సమస్యల ప్రాతిపాదికన బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
     రెండు రోజుల పాటు జరిగే ఈ సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులకు MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కా,,వి.తుకారం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులలో ఎంసీపీఐ యు పార్టీ సభ్యులు 50మంది పాల్గొన్నారు