స్థల దాతను అభినందించి సన్మానించిన - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday January 17, 2022

జగిత్యాల, జనవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణం 7వ వార్డు ఆర్.టి నగర్ రోడ్ నెంబర్ 9 లో మురుగునీరు బయటికి వెళ్లే మార్గం లేక స్థానిక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనగా స్థానిక వార్డుకు చెందిన బత్తుల శంకర్ 5 లక్షల విలువగల తనకున్న భూమి డ్రైనేజీ నిమిత్తం మున్సిపల్ కు అందజేయగా సామాజిక దృక్పథంతో ముందుకువచ్చి డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిన శంకర్ ను ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానించారు. స్థానిక కౌన్సిలర్ వల్లేపు రేణుకమొగిలి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కౌన్సిలర్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు బొడ్ల జగదీష్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య అడువాల లక్ష్మణ్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.