సురేష్ రాథోడ్ ఆత్మహత్యపై సమగ్రదర్యాప్తు జరపాలి

Published: Thursday August 25, 2022
జుమ్మిడి గోపాల్ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్
 
మంచిర్యాల టౌన్, ఆగష్టు 24, ప్రజాపాలన : సురేష్ రాథోడ్ ఆత్మహత్యపై సమగ్రదర్యాప్తు జరిపించాలని, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ చదువుతున్న నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ,ఖిల్లా డిచ్ పల్లి తండాకు చెందిన గిరిజన విద్యార్థి సురేష్ రాథోడ్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జి తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని,   
గత కొంతకాలంగా బాసర ట్రిపుల్ టీలో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై గత కొంతకాలంగా పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారు. అందులో భాగంగానే సురేష్ రాథోడ్ ను కూడా పోలీసులు తీవ్రంగా వేధించారని,   కేసులు పెడతామని బెదిరించడం వల్లనే సురేష్ రాథోడ్ ఆత్మహత్య చేసుకున్నాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటువంటి నేపథ్యంలో అనుమానాల నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీసి, దోషులను కఠినంగా శిక్షించలని, విద్యార్థి కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్  చేశారు.
 
 
 
Attachments area