గ్రామ సభలలో మహిళలు సింహభాగంలో ఉండాలి : డిఎల్పిఓ అనిత, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Thursday September 30, 2021
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : అక్టోబర్ 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో మహిళలు సింహభాగంలో పాల్గొనాలని డిఎల్ పిఓ అనిత, ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్ లు సంయుక్తంగా తెలిపారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలో గల మర్పల్లి మండల కేంద్రంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా యోజనా కార్యక్రమాన్ని మర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో డిఎల్ పిఓ అనిత, ఎంపీడీఓ వెంకట్ రామ్ గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభల ఎజెండా కాపీలను సంబంధిత ఆ కలలకు పంపించాలని సూచించారు. గ్రామ సభలలో ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో ఫోటోలు అప్లోడ్ చేయాలని తెలిపారు. మహిళలు ఎక్కువ శాతం హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ పెంటింగ్స్ వేయించాలని కోరారు. మహిళా సంఘాల ద్వారా సెగ్రీ గేషన్ ప్రోగ్రాం పొడి తడి చెత్త సేకరణను సంఘాల ద్వారా చేయించాలని వివరించారు. వాచ్ అండ్ వార్డ్ పేమెంట్ గురువారం వరకు 2020 - 21 సంవత్సరం వరకు100% పూర్తి చేయాలని కార్యదర్శులకు టెక్నికల్ అసిస్టెంట్ లకు ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ నుండి 30 మంది ఉపాధి హామీ కూలీలు ఉండే విధంగా ఉపాధి లేబర్ కు పని కల్పించాలని చెప్పారు. మర్పల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ నర్సరీలో 15 వేల మొక్కలు ఈ సంవత్సర పెంచాలని పేర్కొన్నారు. దాని కి రేపటి వరకు  ఏ ఏ మోక్కలు కావాలో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అందచేయాలని సూచించారు. ఈ కార్య క్రంలో ఎంపిఓ సోమలింగం ఏపిఓ అంజిరెడ్డి, టిఏలు, కార్యదర్శులు పాల్గున్నారు.