ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్

Published: Monday August 01, 2022

జగిత్యాల, జూలై, 31 ( ప్రజాపాలన ప్రతినిధి): పావని కంటి ఆసుపత్రి లో అపి, రోటరీ క్లబ్ సహకారం తో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 23 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ అన్ని ఇంద్రియాల కన్నా కళ్ళు చాలా ప్రధానమైనవి అని, ఏ సమస్య ఉన్న ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలి అని అన్నారు. ప్రపంచంలో నీ అంధత్వం లో భారత దేశంలో సగం మంది అందులు ఉన్నారు అని, తెలంగాణ రాష్ట్రం లో కూడా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందులను గుర్తించి వారికి పరీక్షలు చేయించి అవసరమైన అద్దాలు అందజేశారు అని అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి లో సైతం 4 గురు కంటి వైద్యులు ఉన్నారని, బీద, మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్య, వ్యవసాయం, న్యాయం పై ప్రత్యేక దృష్టి సారించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత, మాకునురి రాధిక, డా.విజయ్, నాయకులు, రాజీ రెడ్డి, ఆసుపత్రిసిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.