గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

Published: Wednesday September 22, 2021
బోనకల్ ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గ భవాని మంగళవారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బోనకల్ లో జరిగిన ఉపాధ్యాయుల  సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2018లో నియమించబడిన ఉపాధ్యాయులకు పి ఆర్ సి  అమలులో జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు ఇంక్రిమెంట్సు మంజూరు చేయాలని కేర్ టేకర్స్ ను నియమించాలని పార్టి స్కేల్స్ మంజూరు చేయాలని గురుకుల పాఠశాల లను తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు కె.రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, ఉపాధ్యక్షులు చంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షురాలు పి.సుశీల, పి.గోపాల్ రావు, బి.ప్రీతమ్, చిన్న రంగారావు పివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.