కీ.శే. పివి రావు 17వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు

Published: Friday December 23, 2022

 హైదరాబాదు 22 డిసెంబర్ ప్రజాపాలన:

కీ. శే. పివి రావు  17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
మింట్ కాంపౌండ్ నందు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు శ్రీ జి చెన్నయ్య  ఆధ్వర్యంలో క్రీ.శే.( కాకా ) గడ్డం వెంకటస్వామి  9వ వర్ధంతి మరియు క్రీ. శే. పివి రావు  17వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నయ్య గారు కీర్తిశేషులు పి.వి. రావు  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పి. వి. రావు  ఒక సామాజిక సైనికుడు నిరంతరం అంబేద్కర్ జానీ నిలబెట్టడానికి పరితపించిన యోధుడు ఐఏఎస్ ఉద్యోగాన్ని తృణపాయంగా వదులుకొని కులాల మధ్య పెరుగుతున్న అంతరాలను పారదో లడానికి ఉదయించిన వేకువ పొద్దు పివి రావు అని కొనియాడారు.పివి రావు  ఆశించినట్లుగా దళితులందరూ ఏకమై ఐక్యత కోసం పోరాటం చేయాలని అన్నారు.మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఐఏఎస్ కేడర్ లో ఉన్న పీవీ రావు తన వృత్తిని తృణపాయంగా వదిలేసి ఏబిసిడి వర్గీకరణ వద్దు అని 59 ఉపకులాలు కలిసి ఉండాలని అందుకోసం సుప్రీంకోర్టులో పోరాడి తన జీవితాన్ని అంకితం చేశారు. మాలల సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమంలో ప్రాణాలు విడిచిన త్యాగశీలి,  అంబేద్కర్ వాది, మాల జాతి ముద్దుబిడ్డ మాన్య  కీ.శే.  పివి రావు  అని కొనియాడారు. అదేవిధంగా కీ.శే.(కాక) గడ్డం వెంకటస్వామి  9 వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న    కీ.శే .గడ్డం వెంకటస్వామి  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య . ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరాశ్రయులైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు గుడిసెలు వేసి వారికి ఆశ్రయం కల్పించిన గొప్ప నేత అని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంతో కొట్లాడిన మహనీయుడని బొగ్గు కార్మికుల కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో ఈ మహనీయుల వర్ధంతి వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జంగా శ్రీనివాస్, రాష్ట్ర జనరల్  సెక్రెటరీ మన్నే శ్రీధర్ రావు, బంగి ఆనంద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ భైండ్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ శశికాంత్, గోపాజు,రమేష్ బలవంత్,దయానంద్, దాసరి సత్యనారాయణ, మహేష్,విష్ణు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.