అక్రమ అరెస్టులు ఖండిస్తున్నా

Published: Monday May 10, 2021
యువజన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని
ఖమ్మం మే 9( ప్రజాపాలన ప్రతినిధి ) : మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలు భూ ఆక్రమణలు అవినీతిపై ప్రజాస్వామ్యబద్ధంగా మేడ్చల్ జిల్లా దుండిగల్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారి మరియు 13 మంది ఇతర నాయకుల పై 8 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని జిల్లా యువజన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని అన్నారు ఈరోజు ఎన్ ఎస్ యు ఐ నాయకులు అక్రమ అరెస్టు నిర్బంధం పై ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జెర్రిపోతుల అంజని ఈటల రాజేందర్ గారికి ఒక న్యాయం మంత్రి మల్లారెడ్డి గారికి ఒక న్యాయం గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారని యదేచ్ఛగా కబ్జాలు అవినీతి బెదిరింపులకు పాల్పడుతూ సాక్ష్యాధారాలతో దొరికిన మంత్రి మల్లారెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన మంత్రి మల్లారెడ్డి గారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్రమంగా అరెస్టు చేసి నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టిన ఎన్ ఎస్ యు ఐ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు