పట్లూర్ హనుమాన్ మందిర్ నిర్మాణానికి 1.20 కోట్లు దాతల విరాళం

Published: Tuesday February 14, 2023
* హనుమాన్ మందిర్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దేవరదేశి అశోక్
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : హనుమాన్ మందిర్ నిర్మాణానికి 1.20 కోట్ల రూపాయలు దాతల ద్వారా విరాళాలు వచ్చినవని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దేవరదేశి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగమన శాస్త్ర ప్రకారం వేద పండితుల సహకారంతో శ్రీ హనుమాన్ మందిరం నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. ఆదివారం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు హనుమంతున్ని భక్తి ప్రపత్తులతో స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారని వివరించారు. హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభాన్ని జైశ్రీరామ్ జై హనుమాన్ వంటి నినాదాలతో ఏర్పాటు చేశారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం వంటివేద మంత్రోచ్ఛారణలు ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించాయన్నారు. రామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామోభతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాన్రు హరే... వేదోద్ధారక విచారమతే సోమకదానవసంహారమే మీనాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం వంటి శ్రీరామచంద్రమూర్తిని భక్తులు కలవడం విశేషం అని అన్నారు.
హనుమాన్ మందిర్ నిర్వహణ వ్యవస్థల కొరకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, మర్పల్లి మండల జెడ్పిటిసి మధుకర్ సహకారం మరువలేనిదని కొనియాడారు. కమలాకర్ పంతులు వారి కుటుంబ సభ్యులు కలిసి శ్రీ ఆంజనేయ స్వామి మందిర నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహకారంగా రూ.1,51,000 ఇచ్చారన్నారు. వారికీ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో శ్రీ హనుమాన్ మందిర నిర్మాణానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆర్థిక సహకారం అందజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆలయ నిర్మాణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరికీ శ్రీ హనుమాన్ కృప ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్లూరు గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ శ్రీశైలం తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.