బీసీ జాగృతి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి

Published: Thursday August 19, 2021
మంచిర్యల బ్యూరో, ఆగస్టు18, ప్రజాపాలన : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని వేడుకలు మంచిర్యాల పట్టణంలో ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకు న్నారు. పాపన్న గౌడ్  చిత్ర పటానికి పూలమాలలువేసి స్వీట్ లు పంచారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ లు మాట్లాడుతూ 1650లో ఉమ్మడి వరంగల్ జిల్లా బిలాస్ పూర్ గ్రామంలో సాధారణ సామాన్య గీతా కార్మికుడిగా జన్మించిన పాపన్న రజాకార్ల ఆగడాలను పసిగట్టి హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు. బహుజన రాజ్యాధికారం దిశగా ఉద్యమం ప్రారంభించి కుమ్మరి కమ్మరి చాకలి దూదేకుల కులాన్ని ఐక్యం చేసారని, వారిని సైనికుల్లా మలుచుకుని రజాకార్ల ఆ స్థానాలపై తిరుగుబాటు చేసి 33 సంస్థానా లను స్వాధీనం చేసుకొని 30 సంవత్సరాలు ఏలిననటువంటి గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బీసీ సమాజం పనిచేయాలని కోరారు. అలాగే ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, నేటి తరానికి స్పూర్తి నింపుతుందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇచ్చి ఆయన జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్,  మెత్యాల సంతోష్, మంచర్ల సదానందం, తోకల మహేష్, పడాల శ్రీనివాస్, వైద్య భాస్కర్, కీర్తి రవి, గుమ్ముల శ్రీనివాస్, కమల్ గౌడ్, బొలిశెట్టి పోశన్న, బోనగిరి రాజిరెడ్డి, ప్రకాష్ గౌడ్, మధుకర్ గౌడ్, జీవన్ గౌడ్, బద్ది శీను తదితరలు పాల్గొన్నారు.