సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగానిర్వహిచాలి : బచ్చిగళ్ల రమేష్ బిజె

Published: Wednesday September 15, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాలేరని మన తెలంగాణ మనకు వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనమే అధికారికంగా జరుపుకోవచ్చని ఉద్యమ సమయంలో ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అయినా విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు చేయడం లేదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం మైనార్టీల ఓట్ల కొరకై ఒకే ప్రాంతానికి పరిమితమైన ఎంఐఎంకు భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని, పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో అధికారంగ నిర్వహిస్తుంటే ఎన్నో ఆశలతో భవిష్యత్ ను ఎంతో అందంగా ఊహించిన తెలంగాణలో మాత్రం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తలేరని ఇకనైనా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గత ఎన్నో ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని ఈ సంవత్సరం కూడా ప్రతి ఎమ్మార్వో కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మజ్లీస్ పార్టీకి భయపడకుండా పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అధికారికంగా నిర్వహిస్తున్నారో అలాగే మన రాష్ట్రంలో కూడా అధికారికంగా నిర్వహించాలని లేనియెడల 2023 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చాక మా ప్రభుత్వమే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని వారు తెలిపారు.