అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ ను కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని విన

Published: Friday July 29, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా స్థలాలు ఇవ్వొద్దనే జీవో నెంబర్ 493, ను రద్దుచేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దారు కి ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సి వస్తుందని జీవో నెంబర్ 493 తీసుకొచ్చి ఇళ్లస్థలాలు ఇవ్వకుండా చేశాడు ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా గత ఆరు సంవత్సరాలుగా డబల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్నికల లబ్ధి కోసం పెండింగ్ పెట్టారు. కావున వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ప్రతి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అట్టి భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై  కబ్జాలు చేసి ప్రభుత్వ భూముల మీద కోట్లు సంపాదిస్తున్నారు. పేదవాడికి 60 గజాల ఇంటి స్థలం ఇవ్వమంటే , ఎటు గత్యంతరం లేని వారు చిన్న గుడిసె వేసుకుంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పేదవాడికి అన్యాయం చేస్తూ, బడా బాబులకు మాత్రం ఊడిగం చేస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం . కావున జీవో నెంబర్ 493 ను వెంటనే రద్దుచేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేనియెడల పేద ప్రజలకి ఇండ్ల స్థలాలు వచ్చేంతవరకు ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ. రసూల్ సుధాకర్ మల్లయ్య నరసింహ పాల్గొన్నారు.