డెంగీ,మలేరియా పై అవగాహన

Published: Wednesday September 29, 2021
మధిర, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : దెందుకూరు పిహెచ్సి పరధిలో దెందుకూరు జిపి పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో ఇంటింటా దోమలు నివారణ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పారా మెడికల్ సిబ్బంది చేపట్టినారు. ఈ సందర్బంగా పిహెచ్సి ఆరోగ్య పరివేక్షకుడు లంకా కొండయ్య మాట్లాడు తూ దోమలు పుట్టకుండా దోమలు కుట్ట కుండా చూసుకోవాలి అని, ప్రతి ఒక్కరు పరిసరాల పారిశుధ్యం పాటించాలి అని, వ్యక్తి గత పరి శుభ్రత పాటించాలి అని, త్రాగునీటి జాగ్రత్తలు ఆహార జాగ్రత్తలు పాటించండి అని, సీజనల్ వ్యాధులు పై అప్రమత్తంగా ఉండాలి అని, పలు విషయాలు ప్రజలకు తెలియ జేసినారు. అనంతరం ఇంటింటికి డెంగీ మలేరియా కరపత్రాలు పంపిణి చేసినారు. ఈ కార్యక్రమం లో హెచ్స్ సుబ్బలక్ష్మి హెచ్స్ కాంత లీలా హెచ్స్ కొండయ్ ఎఎన్ఎం రాజేశ్వరి ఎఎన్ఎం అరుణ జిపి సెక్రటరీ స్రవంతి మలేరియా వర్కర్ వేము వెంకయ్య ఆశ సత్య వతి జిపి గుమ్మస్తా దోర్నాల కృష్ణ పాల్గొన్నారు.