ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday April 04, 2023

-**తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని అని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు*-*.

దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దొడ్డి కొమురయ్య 96వ జయంతి ఉత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు పాల్గొనీ జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని, తెలంగాణలో భూస్వామ్యపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న జన్మించారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమడానికి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు.  రైతాంగ సాయుధ పోరాటంలో కొమురయ్య కనబర్చిన తెగువ, పోరాట పటిమను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కాగా, దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం పట్ల కురుమ సంఘం నాయకులు హర్షం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, బిసి సంక్షేమ అధికారి ఉదయ భాస్కర్, కురుమ సంఘం నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.