*విద్యార్థుల జీవితాలతో చెలగాటం* *పేపర్ లీకేజ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి* *పిడిఎస్యు డ

Published: Wednesday April 05, 2023
చేవెళ్ల ఏప్రిల్ 4 (ప్రజా పాలన):-

పదవ తరగతి విద్యార్థుల పరీక్ష పేపర్ల లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న పాలక ప్రభుత్వాలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని తక్షణమే దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలి. అని అలాగే ఎస్ఎస్సి బోర్డుని తక్షణమే రద్దు చేయాలని... ప్రగతిల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్ అన్నారు.

పదో తరగతి పరీక్షలు మొదలై రెండు రోజులు కాలేదు నిన్న తెలుగు పేపర్, నేడు హిందీ పేపర్ లీకై విద్యార్థులని అయోమయ గందరగోళ పరిస్థితికి నెట్టబడుతున్నారని వారు అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నిద్రాహారాలు మాని పదవ తరగతి ఫస్ట్ ర్యాంకులో పాస్ కావాలని ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు ఈ పాలకులు, అధికారులు వారి యొక్క ఆశలను అడియాశలు చేశారని ఆయన అన్నారు. ఎస్ఎస్ సి బోర్డు నామ్ కే వాస్తుగా మిగిలిపోయిందని ఇది విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేదని అర్థమవుతుంది.

*టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని పక్కదోవ పట్టించడం కోసమే 10వ తరగతి పరీక్ష పేపర్లు లీక్ చేస్తున్నారని... ఇది పాలకుల అధికారుల ఎత్తుగడలో భాగమేనని స్పష్టంగా అర్థమవుతుంది* .ప్రభుత్వాలు చేసి తప్పులకు విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని పిడిఎస్ యు గా డిమాండ్ చేస్తున్నాం.
ఎస్ఎస్ సి బోర్డు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే  నిజామాబాద్ జిల్లాలో 11 మూటలు పేపర్లు విద్యార్థులు పరీక్ష రాస్తే, అందులో పది మాత్రమే ఉన్నాయని ఇంకొక మూట ఎక్కడ పోయిందో కూడా తెలవదని అధికారులు చెప్తున్నారు అని  ఇప్పటివరకు వాటిని పట్టించుకున్న నాదుడే లేడని వారు విమర్శించారు.ఆరు కాలం కష్టపడి చదువుకున్న విద్యార్థుల పరీక్ష పేపర్లు దొరకకుండా పోతే కూడా కనీసం ఎలాంటి స్పందన లేనటువంటి అధికారులు ఉన్నారని.  ఇక విద్యార్థులు చదివి ఏం లాభం అని వారు ప్రశ్నించారు? తక్షణమే ఎస్ఎస్ సి బోర్డుని రద్దుచేసి,విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాలకులు అధికారులపై చర్యలు తీసుకోవాలని  పిడిఎస్ యు గా డిమాండ్ చేస్తున్నాం.