ఎస్సీ వర్గీకరణకు చొరవ చూపాలి

Published: Saturday January 21, 2023
* మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి.ఆనంద్
వికారాబాద్ బ్యూరో 20 జనవరి ప్రజాపాలన : ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డికి విన్నపం చేశామని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నామని స్పష్టం చేశారు. కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన బలం ఘనత మీకున్నదని మీకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయడంలో ఆలస్యానికి ఆంతరమేమిటోనని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బిజెపి పార్టీకి గుండెకాయ లాంటి ఆర్ఎస్ఎస్ సంఘం మహనీయులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సూచించిన అంత్యోదయ సూత్రాన్ని అనుసరించాలని సూచించారు. అసమానతలు లేని సమాజాన్ని చూడడమే మా లక్ష్యం అన్న పండిట్ దీన్ దయాల్ స్ఫూర్తితో ఎదిగిన బిజెపి మొదటి నుండి ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో జాప్యం జరుగుతుండడం వలన మాదిగలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అప్పగల రమేష్ మాదిగ మహిళా నాయకురాలు పుష్పలత మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్ పట్టణ ఇన్చార్జి మల్లేష్ మహాజన సోషలిస్ట్ పార్టీ బషీరాబాద్ మండల ఇన్చార్జి కృష్ణ ఎమ్మార్పీఎస్ బషీరాబాద్ మండలి ప్రకాష్ ఎమ్మార్పీఎస్ పెద్దముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మహిళా నాయకురాలు పద్మమ్మ గణేష్ రమేష్ విహెచ్పిఎస్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.