63 లక్షల 50 వేల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి

Published: Monday June 07, 2021
బాలపూర్, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : పలు కాలనీల్లో అంచలంచలుగా అభివృద్ధి పనులు అవుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి నరసింహ్మ ఆధ్వర్యంలో నంది హిల్స్ డ్రైనేజ్ పైప్ లైన్ యాభై లక్షల వ్యయంతో, విజ్ఞాన పూరి కాలనీలో 13 లక్షల 50 వేల వ్యయంతో ఓపెన్ జిమ్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి ప్రజా ప్రతినిధులు ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ప్రతి కాలనీలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు జరుగుతాయని, కాలనీ వాసులు అడిగిన ప్రతి అభివృద్ధి పనుల భాగంగా జిహెచ్ఎంసి దగ్గర్లో ఉన్నందున డ్రైనేజీ లింక్ ఆప్ లో గాని, జిహెచ్ఎంసి రోడ్స్ లింక్ ఉన్న రోడ్లను అభివృద్ధి చెయ్యడంలో అదేవిధంగా వర్షం నీరు కూడా మీర్ పేట డ్రైనేజీలో కలిసేటట్లు ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి  26 కోట్లతో కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా సిటీకి నూతనగా కాలనీలకు, విజ్ఞానపురి కాలనీ వాసులందరికీ భవిష్యత్ తరాల వారికి  మంచి నీళ్లు పుష్కలంగా రావాలనుకుంటే కోటి 30 లక్షలతో పూర్తవుతుందని సీఎంతో చెప్పారన్నారు. ప్రతి కాలనీలో ఇంటర్నల్ రోడ్డు కావాలని అడుగుతున్నారుని ప్రతి కాలనీ వాసులకు అంచలంచలుగా వారిగా పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు.  ఓపెన్ జిమ్ లు, పార్కులు ఒకసారి డెవలప్మెంట్ తర్వాత మళ్లీ వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ బి సుమన్ రావు, ఏఈ కృష్ణయ్య, అధికారులు, కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చోహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్ధల లావణ్య బీరప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కల కామేశ్వర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు కరుణానిధి, భిక్షపతి చారి, హరినాథ్ రెడ్డి, భీంరాజ్, ఏనుగుల అనిల్ యాదవ్ కుమార్ యాదవ్, సిద్ధాల చిన్న బీరప్ప, ఇంద్రావత్ రవి నాయక్, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు కాలనీవాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.