గల్ఫ్ కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కొండ సురేఖకు వినతి

Published: Wednesday November 02, 2022
జన్నారం, అక్టోబర్ 31, ప్రజాపాలన:  తెలంగాణలోని జూడో పాదయాత్రలో 500 కోట్లతో గల్ఫ్ కార్మిక సంక్షేమ పండు ఏర్పాటు చేయాలని తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ మల్లికార్జున్, ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల పండు కోసం, డిమాండ్లతో కూడిన పత్రాలను మాజీ మంత్రి కొండ సురేఖకు అందివ్వడం జరిగిందని, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ తెలియపరుస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్రలో ఆయన పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జోడు పాదయాత్రలో రాహుల్ గాంధీని కోరారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశంలో గల్ఫ్ కార్మికులు ఒకవేళ ఎవరైనా మరణిస్తే గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషన్ అందేలా రాహుల్ గాంధీ తన జోడు పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు.