సీఎం విఆర్ఎ లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం* *సీఐటీయూ నాయ

Published: Thursday August 18, 2022
  అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పేస్కేల్, వారి  వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించి రెండు సంవత్సరాలుగా జీవోలు విడుదల చేయకుండా, వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రంలో డివిజన్ పరిధిలో ఉన్న వీఆర్ఏలంతా నాగార్జునసాగర్ హైవే రోడ్డుపై పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపి అనంతరం ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి కిషన్ జిల్లా, నాయకులు ఈ నరసింహ మాట్లాడుతూ వీఆర్ఏలు తరతరాల నుండి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్నారని వీరంతా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారని వీరికి ఇస్తున్న నెలవారి వేతనం రూ.10,500/ల జీతంతో బ్రతకడం ఇబ్బంది అవుతుందని వీఆర్ఏలు తలెత్తుకొని బ్రతికేటట్లు పే స్కేల్ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా చెప్పారని వీరి కోసం 250 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమైన వీఆర్ఏలకు చెల్లించడం పెద్ద భారమేమి కాదని వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కనుక వారిని అన్ని విధాల ఆదుకోవాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారని అన్నారు కానీ  రెండు సంవత్సరాలు గడిచినప్పటికిని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏల సమస్యలను గుర్తించి వెంటనే చర్చలకు పిలిచి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు ప్రసాద్, భాస్కర్,శ్రీను,జంగయ్య,నాగరాజు,నవీన్,శ్రీకాంత్ రెడ్డి,కరుణాకర్,మల్లిఖార్జున్,సరిత,మాధవి,రాధ తదితరులు పాల్గొన్నారు.