తల్లాడలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..

Published: Tuesday February 01, 2022
తల్లాడ, జనవరి 31 (ప్రజాపాలన న్యూస్): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను వంచించడంపై సోమవారం అఖిలపక్ష ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు తాతా భాస్కరరావ మాట్లాడుతూ 383 రోజుల రైతుల పోరాటం ఫలితంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని మిగతా హామీలు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులపై పెట్టిన కేసులుపోరాటంలో మరణించిన రైతులకు ఎక్స్గ్రేషియా లక్కీంపూర్ ఘటనకు సంబంధించిన మంత్రి పై చర్యలు వంటి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకపోతే ప్రభుత్వం రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు, పార్టీ సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, గుంటుపల్లి వెంకటయ్య, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు కృష్ణయ్య, చల్లా నాగేశ్వరావు, ముచ్చింతల చెన్నయ్య, పులి వెంకటనరసయ్య, షేక్ మస్తాన్, నరేష్, సిపిఐ యంయల్ నాయకులు లాల్ మియా, తెలుగుదేశం నాయకులు రావూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.