వరద ముంపు ప్రాంతాలను కేసీఆర్ సందర్శించలి. - దుంపల రంజిత్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు .

Published: Tuesday August 30, 2022
 ముఖ్యమంత్రి కెసిఆర్ మంచిర్యాల ముంపు ప్రాంతాలను సందర్శించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్
డిమాండ్ చేశారు. సోమవారం  మంచిర్యాల జిల్లా కేంద్రంలో బారీవర్షాల వల్ల వరదలు వచ్చి ముంపుకు గురైన కాలనీలలో ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ  పెద్దపల్లి  జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మంచిర్యాల ముంపు ప్రాంతాలన్నింటిని సందర్శించాలని, సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.2000 వేల కోట్లు మంచిర్యాలకు ప్రకటించాలన్నారు. బాలాజీ నగర్ లో వరద ముంపు కారణంగా సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నా బాధిత మహిళ కుటుంబానికి తక్షణమే 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.  ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, టైసన్, తదితరులు పాల్గొన్నారు.