మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలి

Published: Monday October 03, 2022
సిద్దులూరు సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 2 అక్టోబర్ ప్రజాపాలన : మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలని సిద్దులూరు గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ హితవు పలికారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోగల సిద్దులూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ పంచాయతీ కార్యదర్శి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు గాంధీ జయంతి వేడుకలు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధులూరు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిద్ధులూరు గ్రామానికి 650 బతుకమ్మ చీరలు వచ్చినవని తెలిపారు. రేషన్ కార్డులో పేరు ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందచేస్తామని స్పష్టం చేశారు. గ్రామసభ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు హరితహారం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మురికి కాల్వల శుభ్రత మోరీలలో చెత్తాచెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాల గురించి చర్చించారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారికి గ్రామపంచాయతీ నుండి జరిమానా విధించబడునని హెచ్చరించారు. ఎవరి ఇండ్ల ముందు ఉన్న మోరీలలో చెత్తాచెదారం వేస్తే ఆ ఇంటి యజమానికి కూడా జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి యజమాని మరుగుదొడ్డిని నిర్మించుకొని ఆ మరుగుదొడ్డిని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరుగుదొడ్డిని ఉపయోగించుకునేలా అలవాటు చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ కిష్టయ్య పిఎసిఎస్ డైరెక్టర్ అనంతయ్య బాలయ్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area